Monday, January 20, 2025

గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఎఎస్ భార్య… మళ్లీ ఇంటికొచ్చి ఏం చేసిందంటే?

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయిన ఐఎఎస్ అధికారి భార్య తొమ్మిది నెలల తరువాత తిరుగొచ్చి ఆయన ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో జరిగింది. గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో రంజీత్ కుమార్ అనే అధికారి కార్యదర్శిగా పని చేస్తున్నాడు. రంజీత్ భార్య సూర్య జయ్ (45) తొమ్మిది నెలల క్రితం ఓ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారిపోయింది. గ్యాంగస్టర్‌తో కలిసి తమిళనాడులో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని వారి నుంచి కాపాడారు. కానీ నిందితులను మాత్రం తప్పించుకున్నారు. సదరు గ్యాంగ్‌స్టర్, సూర్య జైన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమిళనాడు నుంచి తప్పించుకొని నేరుగా గుజరాత్‌లోని తన భర్త ఇంటికి వద్దకు వెళ్లింది. రంజీత్ ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో పాయిజన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసి 108కు ఫోన్ చేసింది.

108 సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించే చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె దుర్మరణం చెందిందని వైద్యులు వెల్లడించారు. రంజీత్ తరపు న్యాయవాది ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడారు. రంజీత్-సూర్య జైన్ అనే దంపతులు గత సంవత్సరం నుంచి వేరుగా ఉంటున్నారని, రంజీత్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, మూడు రోజుల క్రితం సూర్య జయ్ ఇంటికి వచ్చినప్పుడు పని వాళ్లకు ఆమెను ఇంట్లోకి అనుమతించొద్దని చెప్పి ఆయన బయటకు వెళ్లాడు. ఆమెను పనివాళ్లు ఇంట్లోకి రానివ్వకపోవడంతో అతడి ఇంటి ముందు ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని కూడా తీసుకెళ్లేందుకు రంజీత్ నిరాకరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News