Thursday, January 23, 2025

పట్నంలో నువ్వా నేనా?

- Advertisement -
- Advertisement -

మంచిరెడ్డి x మల్‌రెడ్డి! ముఖాముఖి పోరుకు సై
హాట్రిక్ దిశగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ జెండాఎగురవేస్తాం : మల్‌రెడ్డి రంగారెడ్డి

(సదానందం/మన తెలంగాణ):  ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు పోటాపోటీ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మంచిరెడ్డి వర్సెస్ మల్‌రెడ్డి మధ్య పోరు తీవ్రతరం కానుంది. గత మూడుసార్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో మల్‌రెడ్డి రంగారెడ్డి ఓటమి చవిచూశారు. అయినప్పటికి నాలుగవ సారీ కూడ పోటీకి వెనుకాడకుండా మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీ చేసి గెలుపొంది తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలు నామికే వాస్తే అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి మధ్యనే పోరు తీవ్ర తరం కానుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధ్దిలో పరుగులు పెడుతుంది. గతం 15 సంవత్సరాల క్రితం గత పాలకుల నిర్లక్షం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదనే అపవాదు ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇబ్రహీంపట్నం అత్యంత షరవేగంతో అభివృద్ధి జరిగిందని అధికార పార్టీ ఉంది. ఈ నియోజకవర్గంపై ప్రధా న పార్టీల అభ్యర్థులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో 2 లక్షల 86 వేల పై చిలుకు ఓటర్లు ఉండేది. కానీ నేడు 3.లక్షల 28 వేల ఓటర్లు ఉన్నారు. కాగా గతంలో నాలుగు మండలాలు, రెండు నగర పంచాయతీలు ఉండేది. నేడు నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే గులాబీ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ ఎస్‌సి, ఎస్‌టి, బీసీ ఓట్లు నూటికి 8శాతంగా ఉన్నాయి. ఓసి జనాభా 20 శాతం వరకు ఉంటాయి. కానీ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కడ చీలకుండా ఓకే సామాజిక వర్గంపై ఉంటాయనే చెప్పవచ్చు

నాలువగ సారీ విజయం కోసం మంచిరెడ్డి ఎదురుచూపులు…

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. నాలువసారీ ఎమ్మెల్యేగా సిఎం కెసిఆర్ సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వడంతో ఆయన రంగంలోకి దిగారు. గత 15 సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను మళ్లీ గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి జరుగాలంటే ఈసారీ గులాబీ పార్టీనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గెలిస్తే మంత్రి కావడం ఖాయమని ఆయన సన్నిహితులు బహటంగానే చెప్పడం విశేషం.

కాంగ్రెస్ రెట్టింపు ఉత్సాహం…

వరుసగా మూడుసార్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పై మల్‌రెడ్డి రంగారెడ్డి మూడు సార్లు ఓటమి చవిచూడడంతో ఈ దఫా బిఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు బహిరంగానే ఆ పార్టీకి గుబ్ చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు 5 నుండి 10 వేల మంది కాంగ్రెస్‌లో చేరారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఆయనతోపాటు కాంగ్రెస్ శ్రేణులు ఊరు వాడ ప్రచారంలో ఉరకలు వేస్తున్నారు. ఎక్కడ వెళ్ళిన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పొందు పర్చిన 5 లక్షలకే ఇండ్లు, 500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధ్దులకు 5 వేల పెన్షన్, 2 లక్షల రుణమాఫీ, మహిలళకు బస్సులో ఉచిత ప్రయాణం లాంటి పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా జనం తరలిరావడంతో కాంగ్రెస్ జెండా ఎగుర వేయడం ఖాయమనే ధీమాతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు.

మోడీ చరిషాతో నోముల దయానంద్…

గత మూడు పర్యాయాలు బిజెపి అభ్యర్థిగా ఇబ్రహీంపట్నంలో పోటీలో ఉన్నారు. కానీ ఎప్పుడు ఆ పార్టీకి కలిసి రావడంత లేదు. ఈసారీ మోడీ చరిష్మాతో నైనా కలిసి వస్తుందనే ధీమాతో ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ తరుపున నోముల దయానంద్ గౌడ్‌ను బరిలో దించారు. ప్రధానంగా ఆయన డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధ్ది జరుగుతుందని ప్రచారం చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్టులకు, బిఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారు. ఈ సారి బిజెపికి ఒక్క అవకాశం యిస్తే ఇబ్రహీంపట్నను అభివృద్ధి చేసి చూపిస్తా అంటు ముందుకు సాగుతున్నారు.

దూసుకపోతున్న మిగిలిన పార్టీలు…

ఎన్నికలు సరిగా మరో 15 రోజులు మిగిలి ఉండడంతో కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, బిఎస్‌పి, ధర్మసమాజ్ పార్టీ, స్వతంత్రులు పోటా పోటీగా నామినేషన్లు వేసి ప్రచారం వేగవంతం చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. గల్లిలో మైక్ సౌండ్లతో మారుమ్రోగుతున్నాయి. ఎన్నికలు మరికొద్ది రోజులు ఉండడంతో ప్రచారం ఊపుందుకుంది. పార్టీల నేతలు గంటలలోనే అటు నుండి ఇటు నుండి అంటు తేలికగా పార్టీలు మారుతున్నారు. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తహాతహాలాడుతుండగా కాంగ్రెస్ జెండా ఎగురవవేయాలని మల్‌రెడ్డి రగారెడ్డి తాపత్రయపడుతున్నారు. మొదటిసారీగా ఇబ్రహీంపట్నం కమలానికి ఒక్క అవకాశం యివ్వాలని బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ప్రజలకు విజప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News