Monday, January 20, 2025

సంవత్సరాలు గడిచిన పూర్తి కానీ కల్వర్టు పనులు

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : అధికారుల ఆలస్యం, ప్రజా ప్రతినిథులు నిర్లక్ష్యంతో ఇబ్రహీంపట్నం నుండి తుప్రాన్‌పేట వరకు డబుల్ రోడ్డు ప్రారంభించి నేటికి 6 సంవత్సరాలకు పైగా అవుతున్న రోడ్డు పనులు పూర్తి కాలేదు. దండుమైలారం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, పావురాల గుట్ట సమీపంలో మరో కల్వర్టు పనులు పూర్తి కాలేదు. దీంతో రాత్రి పూట అటు నుండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కానీ కల్వర్టు పనులు పూర్తి చేయడంలో అధికారులు ,ప్రజా ప్రతినిథులు పూర్తిగా విఫలమైనారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ రోడ్డు నుండి వాహనాలు విజయవాడ నుండి బైపాస్‌ రోడ్డు మీదుగా నాగార్జున సాగర్ రావడానికి అతి సులబమైనా రోడ్డు ఈ రోడ్డు గుండా వాహనాలు ఎక్కువగా రావడంతో రాత్రిపూట దోపిడి దొంగలు వాహనాలను నిలిపి డ్రైవర్ల వద్ద ఉన్న నగదుతో పాటు దాడులకు పాల్పడుతు బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా సబందిత అధికారులు , ప్రజా ప్రతినిథులు వెంటనే కల్వర్టు పనులు పూర్తి చేసి వాడుకలోకి తీసుకరావాలని వాహణదారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News