హైదరాబాద్: అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలిచిన భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 40 మిలియన్ చదరపు అడుగులను నిర్మించి అందిస్తే ఈ సంవత్సరం అది 46 మిలియన్ చదరపు అడుగులను అధిగమించవచ్చని అంచనా. రాబోయే 2–3 సంవత్సరాలలో 40 % మార్కెట్ వాటా దేశం కలిగి ఉంటుందని అంచనా. ఈ సంఖ్యలు దేశం సాధిస్తోన్న ప్రగతిని తెలియజేస్తున్నప్పటికీ విద్యుత్ భద్రత ప్రమాణాల అనుసరణ పరంగా మాత్రం వెనుకబడి ఉంది. ఓ అంచనా ప్రకారం భారతదేశంలో 2019–2020 సంవత్సరంలో 4వేల మంది విద్యుత్ షాక్, ప్రమాదాల వల్ల వల్ల మరణించారు. భారతదేశంలో ప్రతి రోజూ 11 మంది విద్యుత్ ప్రమాణాల వల్ల మరణిస్తున్నారు.
భారత ప్రభుత్వం విద్యుత్ భద్రత, ఇంధన పరిరక్షణ గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ పరిశ్రమ సరిగా నిబంధనలు పాటించకపోవడం, సరికాని లేదంటే శక్తివంతమైన ఇన్‌స్టాలేషన్స్ డిజైన్ లేకపోవడం, నాణ్యతలేని వైర్ల వినియోగం వంటివి జరుగుతున్నాయి. ఈ తరహా కారణాల వల్ల విద్యుత్ నష్టాలు ఎక్కువ కావడంతో పాటుగా 56% విద్యుత్ ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను అందించేందుకు ఐసీఏ ఇండియా తమ జీరో టోలరెన్స్ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించింది. దీనిద్వారా విద్యుత్ ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా మెరుగైన సాంకేతిక ప్రక్రియలను అనుసరించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఐసీఏ ఇండియా ఓ టెక్నికల్ సెషన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి జీరో టోలరెన్స్ ఎలక్ట్రిక్ సేఫ్టీ ప్రచారం ప్రారంభించింది.
గృహ, వాణిజ్య, పబ్లిక్ బిల్డింగ్స్‌లో విద్యుత్ భద్రత పై ఓ టెక్నికల్ సెషన్‌ను హైదరాబాద్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఐజీబీసీ(ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) సహకారంతో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐఈసీ 62305 మరియు ఎన్‌బీసీ 2016 కోడ్స్ చర్చించడంతో పాటుగా ప్రమాదాల నివారణలో వైర్ల ప్రాధాన్యతను గురించి కూడా చర్చించారు. ఐజీబీసీ హైదరాబాద్ చాఫ్టర్ ఛైర్మన్ సీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన, హరిత దేశంగా ఇండియా మారేందుకు ఐజీబీసీ, ఐసీఏ ఇండియా సహాయపడుతున్నాయి. అక్టోబర్ 20–22 వరకూ హైదరాబాద్‌లో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022ను హెచ్‌ఐసీసీలో నిర్వహించబోతున్నామని, 500కు పైగా గ్రీన్ ప్రొడక్ట్స్, టెక్నాలజీస్ ప్రదర్శించనున్నామన్నారు. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా (ఐసీఏ ఇండియా) డైరెక్టర్ కె ఎన్ హేమంత్ మాట్లాడుతూ విద్యుత్ భద్రత, జీరో టోలరెన్స్ విధానం స్వీకరించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి ఐసీఏ కట్టుబడి ఉందన్నారు.
ICA India hold Technical Meeting on Protect of Electricity