Thursday, January 23, 2025

సిఎ పరీక్ష తేదీల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల దృష్టా తమ పరీక్షల తేదీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) మార్చిందని అధికారులు వెల్లడించారు. చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలు లోగడ నిర్ణయించినట్లుగా మే నెలలోనే జరుగుతాయి. కానీ పరీక్షల తేదీలను మార్చడమైంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, గ్రూప్ 1 కోసం ఇంటర్మీడియట్ కోర్స్ పరీక్షను మే 3, 5, 9 తేదీలలో నిర్వహిస్తారు. ఇంతకుముందు ఈ పరీక్షకు నిర్ణయించిన తేదీలు మే 3, 5, 7. గ్రూప్-2 కోసం ఇంటర్మీడియట్ కోర్స్ పరీక్షను మే 11, 15, 17 తేదీలలో నిర్వహిస్తారు. ఇంతకు ముందు ఈ పరీక్షను మే 9, 11, 13 తేదీల్లో నిర్వహించాలని సంకల్పించారు. ఫైనల్ పరీక్షల కోసం గ్రూప్ 1కు మే 2, 4, 8 తేదీలను ఐసిఎఐ ప్రకటించింది. ఇంతకు ముందు ఈ పరీక్షలను మే 2, 4, 6 తేదీల్లో నిర్వహించాలని అనుకున్నారు.

గ్రూప్ 2 కోసం పరీక్షను మే 10, 14, 16 తేదీలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను మే 8, 10, 12 తేదీలలో నిర్వహించాలని లోగడ నిర్ణయించారు. 18వ లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్, జూన్ కాలంలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రకటించిన తరువాత ఈ పరీక్షల టైమ్‌టేబుల్ సవరణకు నిర్ణయం తీసుకున్నారు. ‘పైన పేర్కొన్న పరీక్ష షెడ్యూల్‌లో ఏ రోజునైనా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం/ స్థానిక పాలనాధికార సంస్థ పబ్లిక్ సెలవు దినం ప్రకటించిన పక్షంలో పరీక్ష షెడ్యూల్‌లో మార్పు ఏదీ ఉండదని ఇందుమూలంగా తెలియజేయడమైంది’ అని ఐసిఎఐ పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News