బెంగళూరు పిచ్‌పై అసంతృప్తి
దుబాయ్ : ఇటీవల ముగిసిన భారత్ శ్రీలంక టెస్టు సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు(డే/నైట్) మ్యాచ్‌పై ఐసిసి అసహనం వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు చెలరేగడంతో బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పలేదు. ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ టెస్టుకు ఉపయోగించిన పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని వెల్లడించింది.
బెంగుళూరు టెస్టు కు ఉపయోగించిన పిచ్‌ను ఐసీసీ యావరేజ్‌గా రేటింగ్‌గా ఇచ్చింది. ఐసిసి మార్చి 20, ఆదివారం ఒక ప్రకటన వి డుదల చేసింది. బెంగళూరు టెస్ట్‌లో ఉపయోగించిన పిచ్‌పై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ చిన్నస్వామి పిచ్‌పై తన నివేదికను సమర్పించారు. అందులో అతను పిచ్ సగటు కంటే తక్కువ రేట్ చేశాడు. ఐసీసీ ప్రకారం, శ్రీనాథ్ తన నివేదికలో, మొదటి రోజు నుంచి పిచ్ చాలా తిరుగుతోంది. ప్రతి సెషన్‌లో అది మెరుగుపడినట్లు అనిపించినప్పటికీ, నా దృష్టిలో బంతి, బ్యాట్ మధ్య సమాన పోటీ లేదని పేర్కొన్నాడు. మ్యాచ్ రిఫరీ నుం చి అందిన నివేదిక ఆధారంగా ఎం.చిన్నస్వామి స్టేడియంపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అలాగే శిక్ష విధించింది. ఇందులో భాగంగా చిన్నస్వామి స్టే డియానికి ఒక డీమెరిట్ పాయింట్ లభించగా, అది వచ్చే ఐదేళ్లపాటు వర్తిస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఈ సమయంలో ఒక వేదిక 5 డీమెరిట్ పాయింట్లను పొందినట్లయితే, అది 1 సం వత్సరం పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించకుండా నిషేధించనున్నారు.