- Advertisement -
దుబాయి: అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చర్యలు తీసుకుంది. హెడ్‌తో గొడవకు దిగిన సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. అంతేగాక ఒక డీమెరిట్ పాయింట్‌ను జరిమానాగా వేసింది. హెడ్‌కు కూడా ఓ డీమెరిట్ పాయింట్‌ను జరిమానాగా విధించింది. ఇద్దరూ తమ తప్పుల్ని అంగీకరించారని, మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షకు అంగీకారం తెలిపారని ఐసిసి ప్రకటనలో వెల్లడించింది.
- Advertisement -