- Advertisement -
దుబాయ్: చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్తాన్ టీ-20 ప్రపంచకప్ లో తలపడనున్నారు. రెండు రౌండ్లుగా టీ 20 ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి. ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. 2021 వరల్డ్ కప్ కోసం ఐసిసి గ్రూపులను శుక్రవారం ప్రకటించింది. గ్రూప్ వన్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్… గ్రూప్ 2లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ లు ఉన్నాయి. మిగితా టీమ్ లు ప్రిలిమినరీ క్వాలిఫయర్స్ ఆడనున్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య యుఎఇలో టీ-20 ప్రపంచకప్ జరగనుంది. తొలి రౌండ్లో రెండు గ్రూపుల నుంచి ఎనిమిది జట్లు తలపడనున్నాయి.
గ్రూప్ 1: వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రూప్ ఎ విజేత, గ్రూప్ బి రన్నరప్
గ్రూప్ 2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్ ఎ రన్నరప్, గ్రూప్ బి విజేత
గ్రూప్ ఎ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్
బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్
ICC announced groups for 2021 T20 World Cup
- Advertisement -