Friday, November 15, 2024

ఛాంపియన్ ట్రోఫీపై ఐసిసి కీలక ప్రకటన

- Advertisement -
- Advertisement -

ఎనిమిది జట్లకే అర్హత
ఛాంపియన్ ట్రోఫీపై ఐసిసి కీలక ప్రకటన
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) కీలక ప్రకటన విడుదల చేసింది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ప్రమాణాలు, విధివిధాలకు సంబంధించి ఇంట్రక్షన్‌ను ఐసిసి విడుదల చేసింది. పాకిస్థాన్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నికి ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో తొలి ఏడు స్థానాల్లో నిలిచిన జట్టుకు మాత్రమే నేరుగా అర్హత సాధిస్తాయని పెర్కొంది.

ఇదిలా ఉండగా తమకు ఈ విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఐసిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, 2023 వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించని జట్లు వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్టు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అయితే అతిధ్య పాక్ జట్టు టాప్7లో ఉంటే 8వ జట్టును ఏవిధంగా ఎంపిక చేస్తారనే దానిపై ఐసిసి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. కాగా, రెండేళ్లకోసారి ఇప్పటి వరకూ ఎనిమిది ఎడిషన్స్ నిర్వహించిన ఐసిసి 2017లో ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ చివరిది. ఈ ఇడిషన్‌లో భారత్‌-పాక్ తలపడగా టీమిండియాను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది పాక్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News