Friday, November 15, 2024

ఐసీసీ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో ముగ్గురు మనోళ్లే..

- Advertisement -
- Advertisement -

పురుషుల ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డుకు పోటీ పడుతున్న నలుగురు క్రికెటర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఈ నలుగురు ప్లేయర్స్ లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఈ అవార్డు రేసులో పోటీ పడుతున్నారు. ఐసీసీ.. పురుషులు, మహిళలలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారికి ప్రతీ సంవత్సరం అన్ని ఫార్మాట్లలో ఈ అవార్డులను అందజేస్తుంది.  2023 సంవత్సరానికి గాను వన్డే ఫార్మాట్ లో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేషన్లను ప్రకటించింది.

ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న నలుగురు ఆటగాళ్ల పేర్లను తాజాగా వెల్లడించింది ఐసీసీ. ఇందులో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శుభ్ మన్ గిల్ లతోపాటు న్యూజీలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఉన్నాడు. ఈ నలుగురిలో మీరు ఓవరికి ఓటు వేస్తారంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. మరి, ఈ నలుగురిలో వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు అందుకుంటారో చూడాలి.

ఇక, మహిళా వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ పోటీపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News