Wednesday, January 22, 2025

క్రికెట్‌లో మరో కొత్త రూల్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కొత్త రూల్‌ను ఐసిసి ప్రవేశ పెట్టనుంది. ఈ కొత్త రూల్ మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. స్టాప్ క్లాక్ పేరుతో ఐసిసి సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తన తర్వాతి ఓవర్‌లోని మొదటి బంతిని అంతకు మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేయకపోతే రెండు సార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు.

మూడో సారి కూడా అలానే జరిగితే.. బౌలింగ్ చేసే జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో చేరుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్‌తో ఈ సమయాన్ని లెక్కిస్తారు. ఆట వేగాన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసిసి ఒక ప్రకటనలో వెల్లడించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం ప్రారంభమయ్యే టి20 సిరీస్ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News