Thursday, December 19, 2024

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసిసి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఐసిసి పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు రెండోస్థానానికి పడిపోయింది. భారత్‌తో రాయ్‌పూర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన కివీస్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. న్యూజిలాండ్‌ను అధిగమించిన ఇంగ్లాండ్ జట్టు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో టాపర్‌గా నిలిచింది. భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలవడంతో వన్డే సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. వరుస ఓటములతో సిరీస్‌తోపాటు వన్డే ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది.

భారత్‌తో రెండో ఓటమికి ముందు న్యూజిలాండ్ 115పాయింట్లుతో అగ్రస్థానంలో, ఇంగ్లాండ్ 113 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా 112 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. భారత్ 111పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. అయితే, టీమిండియా ఓడిపోయిన కివీస్ 113రేటింగ్ పాయింట్లుకు పడిపోయి రెండోస్థానానికి పడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా మూడోస్థానానికి ఎగబాకింది.

కాగా వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి మూడుస్థానాల్లో కొనసాగుతున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ జట్ల ఖాతాలోనూ 113రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 112పాయింట్లతో నాలుగోస్థానంలో ఆస్ట్రేలియా, 106పాయింట్లతో ఐదోస్థానంలో పాకిస్థాన్ టాప్5లో కొనసాగుతున్నాయి. కాగా, తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన టీమిండియా మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డేల సిరీస్‌లోని చివరి వన్డే రేపు మంగళవారం వేదికగా జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News