Thursday, December 19, 2024

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం ఐసిసి ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 5నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. లీగ్ దశలో ప్రతి జట్టు 8 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 11న ఢిల్లీలో అఫ్ఘనిస్థాన్, అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో పాకిస్థాన్, అక్టోబర్ 19న ఫుణెలో బంగ్లాదేశ్, అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్, అక్టోబర్ 19న లఖ్‌నవూలో ఇంగ్లండ్, నవంబర్ 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా జట్లతో భారత్ తలపడనుంది.

ఇక, నవంబర్ 10న ముంబైలో తొలి సెమీఫైనల్, నవంబర్ 16న కోల్‌కతలో రెండో సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి.  నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, హైదరబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి.

Also Read: ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌: జింబాబ్వే రికార్డు విజయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News