Saturday, November 23, 2024

కొత్త పాయింట్ల విధానానికి ఐసిసి ఆమోదం

- Advertisement -
- Advertisement -

ICC Approves New WTC Points System

దుబాయి: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్2 సరికొత్త విధానానికి ఐసిసి ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల విధానాన్ని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు డ్రా అయితే నాలుగు, టై అయితే ఆరు పాయింట్లు లభిస్తాయని తెలిపింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే అయిదు టెస్టుల సిరీస్‌తో రెండేళ్ల సైకిల్ ప్రారంభమవుతుంది. గత చాంపియన్‌షిప్‌లో ఒక సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించా రు. రెండు మ్యాచ్‌లే ఉంటే ఒక్కో మ్యాచ్‌కి 60 పాయింట్లు వచ్చేవి. నాలుగు మ్యాచ్‌లు ఉంటే ఒక్కో మ్యాచ్‌కి కేవలం 30 పాయింట్లే వచ్చేవి. దాంతో పాటుగా కొవిడ్ కారణంగా మ్యాచ్‌లు జరగకపోవడంతో దీన్ని మధ్యలోనే మార్చేశా రు. పర్సంటేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే దీనిలో సమానత్వం లేదని, లోటుపాట్లున్నాయని విమర్శలు వచ్చాయి. దాంతో ఐసిసి కొత్త పాయింట్ల విధానాన్ని తీసుకువచ్చింది. ‘గత విధానాన్ని సవరించాలని మాకు సూచనలు అందాయి. క్రికెట్ కమిటీ వాటిని పరిగణనలోకి తీసుకొని కొత్త విధానాన్ని ప్రతిపాదించింది.

ఇప్పుడు మ్యాచ్‌లతో సంబంధం లేకుండా పాయింట్లు లభిస్తాయి. కరోనా మహమ్మారి కారణంగా అందుబాటులో ఉన్న పాయింట్ల ఆధారంగా ర్యాంకులు ఇచ్చాం. దానివల్లే ఫైనల్ జట్లను నిర్ణయించగలిగాం’ అని ఐసిసి తాత్కాలిక సిఇఓ జెఫ్ అలార్డిన్ అన్నారు. ఐసిసి రెండో చాంపియన్‌షిప్‌లో ఎక్కువ సంఖ్యలో టెసుట్లున్న సిరీస్‌లు తక్కువగానే ఉన్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌లు, భారత్, ఆసీస్ మధ్య, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు సిరీస్‌లే పెద్దవి. తర్వాత మిగతా అన్ని సిరీస్‌లోను 3 అంతకన్నా తక్కువ టెస్టులే ఉన్నాయి.

ICC Approves New WTC Points System

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News