Sunday, January 19, 2025

హైబ్రిడ్ మోడల్‌లోనే

- Advertisement -
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీపై తొలగిన అనిశ్చితి

దుబాయి: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అనిశ్చితి తొలగిపోయింది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు ఆతిథ్య పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో వివాదానికి తెరపడింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జ ట్టు నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌లో పర్యటించే ప్రసక్తే లేదని, టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని బిసిసిఐ పట్టుపట్టింది. మరోవైపు పాక్ క్రికెట్ బోర్డు కూడా హైబ్రిడ్ పద్ధతికి ఒప్పుకునే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూ ర్చోంది.

దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగడంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ అంతర్జాతీయ క్రికెట్ మండలి చూపిన చొరవతో మార్గం సుగమం అయ్యింది. హైబ్రిడ్ మోడల్‌కు పిసిబి అంగీకరించడంతో మెగా టోర్నమెంట్ నిర్వహణకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. టీమిండియా ఆడే మ్యాచ్‌లతో పాటు నాకౌట్ పోటీలను తటస్థ వేదికల్లో నిర్వహిస్తారు. మిగతా మ్యాచ్‌లు పాక్‌లోనే జరుగుతాయి. కాగా, 202427 మధ్య ఐసిసి టోర్నమెంట్‌లలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఆతిథ్యం ఇచ్చే దాయాదిల మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహిస్తారు. భారత్‌లో పాకిస్థాన్, పాక్‌లో టీమిండియా ఐసిసి మ్యాచుల్లో తలపడవు.

ఈ మ్యాచ్‌లను న్యూట్రల్ వేదికల్లో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇదిలావుంటే భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహిస్తారు. పాక్ జట్టు ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత్‌లో పర్యటించదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసిసి త్వరలో ఖరారు చేస్తోంది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిణపై అడ్డంకులు తొలగి పోవడంతో పాక్, భారత్ క్రికెట్ బోర్డులతో పాటు ఐసిసి ఊపిరి పీల్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News