Friday, February 21, 2025

రేపు బంగ్లాదేశ్‌తో భారత్ తొలి పోరు

- Advertisement -
- Advertisement -

అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి బుధవారం తెరలేచింది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌తో సహా 8 జట్లు పోటీపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఇక గురువారం భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు జరుగనుంది. భారత్ తన మ్యాచ్‌లను యుఎఇలో ఆడుతున్న సంగతి తెలిసిందే. దుబాయిలో జరిగే గ్రూప్‌ఎ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ సాధించి జోరుమీదుంది. బంగ్లాదేశ్ కూడా దూకుడు మీద కనిపిస్తోంది. కొంత కాలంగా బంగ్లా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంతక నిలకైడన ఆటను కనబరుస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News