- Advertisement -
దుబాయి: వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్, యూఎస్‌ఎ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అమెరికాలోని వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది. యూఎస్‌ఎలోని మూడు నగరాలకు ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా,న్యూయార్క్ నగరాల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతాయి.
కాగా, ఈ వేదికల్లో మాడ్యూలర్ విధానంలో సౌకర్యాలను కల్పించాలని ఐసిసి నిర్ణయిచింది. ఈ మేరకు న్యూయార్క్‌లో 34 వేల సీటింగ్ కెపాసిటీతో అధునాతన స్టేడియాన్ని తీర్చిదిద్దనున్నారు. నసౌ కౌంటీ స్టేడియాన్ని అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా, న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య టి20 వరల్డ్‌కప్ మ్యాచ్ జరుగనుంది.
- Advertisement -