- Advertisement -
లండన్: టీమిండియా బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్‌కు ఐసిసి జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఐసిసి కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవల్ వన్ తప్పిదంగా పరిగణిస్తూ జరిమానాతో వదిలేశారు. ఇంగ్లాండ్ జట్టుతో నాలుగో టెస్టులో మూడో రోజు తొలి సెషన్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో రాహుల్ కీపర్ జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు. అయితే దీన్ని ఆన్‌ఫీల్డ్ అంపైర్ తొలుత నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ సమీక్షకు వెళ్లగా.. డిఆర్‌ఎస్‌లో రాహుల్ ఔటయినట్లు తేల్చారు. దీనిపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ICC Fined 15% of match fee to KL Rahul
- Advertisement -