ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచకప్ సందడి ప్రారంభమైంది. వరల్డ్‌కప్ ట్రోఫీని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ ట్రోఫీ ముంబై నగరం చేరుకుంది. మంగళవారం ముంబై నగరంలోని వివిధ పాఠశాలల్లో వరల్డ్‌కప్ ట్రోఫీని ప్రదర్శించారు.
విద్యార్థులు ఈ ట్రోఫీతో సందడి చేశారు. విద్యార్థిని, విద్యార్థులకు ట్రోఫీ విశేషాలను వివరించాలనే ఉద్దేశంతో వివిధ పాఠశాలల్లో దీనిని తీసుకెళుతున్నారు. ముంబై నగరంలో ట్రోఫీ ప్రదర్శనకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలావుంటే భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో పది దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం పది నగరాలకు వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. లీగ్ దశలో 45 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, అహ్మదాబాద్‌లో ఫైనల్ సమరం జరుగనుంది. కాగా, హైదరాబాద్ కూడా మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.