Monday, December 23, 2024

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్.. టాప్3లో శుభ్‌మన్ గిల్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం ద్వారా గిల్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. గిల్ ప్రస్తుతం 750 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. గిల్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. మరోవైపు భారత యువ సంచలనం ఇషాన్ కిషన్ కూడా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు.

ఇషాన్ ప్రస్తుతం 20వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం సాధించిన బాబర్ తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకున్నాడు. బాబర్ 882 పాయింట్లతో అగ్రస్‌థానంలో కొనసాగుతున్నాడు. వండర్ డుస్సేన్ సౌతాఫ్రికా 777 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. భారత సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి పదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 11వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ జోస్ హాజిల్‌వుడ్ 705 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత యువ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News