Thursday, January 23, 2025

World Cup 2023: శతకాలతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్స్..

- Advertisement -
- Advertisement -

ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది.

మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫోర్లు సిక్సులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(100), మిచెల్ మార్ష్(101)లు శతకాలు పూర్తి చేసుకున్నారు. దీంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆసీస్ 31 ఓవర్లలోనే 214 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News