Saturday, November 16, 2024

ఐసిసి టి20 ర్యాంకింగ్స్: టాప్‌లోనే సూర్యకుమార్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ 859 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. వరల్డ్‌కప్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరచడంతో సూర్య టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో రిజ్వాన్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో అతను కూడా ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే నాలుగో, ఐడెన్ మార్‌క్రామ్ (సౌతాఫ్రికా) ఐదో ర్యాంక్‌లో నిలిచారు.

డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్), రొసొ (సౌతాఫ్రికా), గ్లెన్ ఫిలిప్స్ (కివీస్), అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), నిసాంకా (శ్రీలంక) టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించారు. భారత స్టార్ విరాట్ కోహ్లి 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో వనిందు హసరంగ (శ్రీలంక) టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో హసరంగ 704 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రషీద్ ఖాన్ (అఫ్గాన్) రెండో, ఆదిల్ షా (ఇంగ్లండ్) మూడో, హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) నాలుగో, సామ్ కరన్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకిబ్ (బంగ్లాదేశ్) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహ్మద్ నబి (అఫ్గాన్) రెండో, హార్దిక్ పాండ్య (భారత్) మూడో ర్యాంక్‌లో నిలిచారు.

ICC Rankings: Suryakumar Yadav continuing at top ranking

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News