Sunday, January 19, 2025

డబ్ల్యూటిసి ర్యాంకింగ్స్.. మరసారి అగ్రస్థానంలో భారత్

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ మరోసారి టాప్ లేపింది. తాజాగా ఐసిసి విడుదల చేసిన టిడబ్లుసి ర్యాంకింగ్స్‌లో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. టిడబ్లుసి 2023-25 సీజన్‌లో ఇప్పటి వరకూ 9 టెస్టులు ఆడిన భారత్ 6 టెస్టులో విజయం సాధించింది. 68.52 విజయశాతం, 74 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా.

కాగా, భారత్‌కు ఇది వరుసగా మూడోసారి ఫైనల్స్ చేరడం. ఇంతకుముందు రెండు దఫాలుగా రన్నరప్ నిలిచిన విషయం తెలిసిందే. 9 జట్లు పాల్గొనే ఈ డబ్లుటిసిలో భారత్ తరువాతి స్థానంలో ఆ్రస్ట్రేలియా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆడిన 12 టెస్టుల్లో ఆస్ట్రేలియా 8 విజయాలు సాధించింది. 3 టెస్టుల్లో పరాజయంపాలైంది. మరో టెస్టులో ఫలితం తేలలేదు. దీంతో 62.50 విజయశాతం, 90 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది.

తొలిసీజన్ ఛాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్ 6 టెస్టుల్లో 3 విజయాలు, 3 పరాజయాలతో 36 పాయింట్లు, 50 విజయశాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్ లోని తొలిటెస్టులో 5 వికెట్ల విజయం సాధించడం ద్వారా 69 పాయింట్లు, 41.07 విజయశాతంతో నాలుగో స్థానానికి చేరుకోగలిగింది. 69 పాయింట్లతో శ్రీలంక ఐదో స్థానంలో ఉంది, ఇక పాకిస్థాన్‌తో జరగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆరో స్థానానికి ఎగబాకింది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్‌లు వరుస ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News