లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో చివరి టెస్టు మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమిండియా కంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉండడం విశేషం. ఆస్ట్రేలియా ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడగా ఆరింటిలో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. దీంతో 84 పాయింట్లతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. ఇక సౌతాఫ్రికా ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి రెండో స్తానంలో నిలిచింది. సౌతాఫ్రికా రెండు టెస్టుల్లో ఓటిమి పాలైంది. కాగా పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ ఏడు టెస్టులు ఆడి మూడింటిలో విజయం అందుకుంది. రెండింటిలో ఓడి మరో మరో రెండు టెస్టులను డ్రాగా ముగించింది. అయితే భారత్ 12 మ్యాచుల్లో ఆరు గెలిచింది. 4 టెస్టుల్లో ఓడిన భారత్ మరో రెండింటిని డ్రా చేసింది. ఐసిసి నిబంధనల ప్రకారం భారత్ ఈ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్ ఐదో, శ్రీలంక ఆరో, ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచాయి. ఇక డిఫెండింగ్ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోవడం గమనార్హం.
ICC Test Rankings 2022: India slip down to 4th Spot