Monday, December 23, 2024

పంత్‌కు ఐదో ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

 

పంత్‌కు ఐదో ర్యాంక్
టాప్10లో బెయిర్‌స్టో, రూట్‌దే అగ్రస్థానం
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ ఐదో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో పంత్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఐదు ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నాడు. ఈ క్రమంలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. పంత్ కెరీర్‌లో ఇదే అత్యత్తుమ ర్యాంక్ కావడం విశేషం.

ఇక ఐదో టెస్టులో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు చారిత్రక విజయం సాధించి పెట్టిన జానీ బెయిర్‌స్టో కూడా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. బెయిర్‌స్టో ఏకంగా 11 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్10లో చోటు సంపాదించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో శతకంతో కదంతొక్కిన జో రూట్ కూడా తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిల పరుచుకున్నాడు. మరోవైపు భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి పడిపోయాడు. 2016 తర్వాత కోహ్లి టాప్10 ర్యాంక్ నుంచి వైదొలగడం ఇదే తొలిసారి. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ICC Test Rankings 2022: Rishabh Pant climbs at 5th spot 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News