Thursday, December 19, 2024

అగ్రస్థానంలోనే అశ్విన్, లబుషేన్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ (బౌలింగ్), మార్నస్ లబుషేన్ (బ్యాటింగ్) విభాగాల్లో టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. డబ్లూటిసి ఫైనల్లో సెంచరీలతో అదరగొట్టిన ఆస్ట్రేలి యా స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లు కూడా తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. ఇక టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానె కూడా ర్యాంకింగ్‌లో ముందు కు దూసుకెళ్లాడు. గాయంతో కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టాప్10లో చోటును కాపాడుకున్నాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల హవా…
తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలి యా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తొలి మూడు ర్యాంక్‌లను ఆస్ట్రేలియా బ్యాటర్లు సొంతం చేసుకోవడం విశేషం. మార్నస్ లబుషేన్ 903 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో కూడా అతను టాప్ ర్యాంక్‌లోనే ఉన్నాడు. ఇక డబ్లూటిసి ఫైనల్లో సెంచరీతో అలరించిన స్టీవ్ స్మిత్ 885 పాయింట్లతో రెండో, ట్రావిస్ హెడ్ 884 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇలా టాప్3లో ముగ్గురు ఆస్ట్రేలియా బ్యాటర్లే నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

మరోవైపు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాలు గో, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) ఐదో ర్యాంక్‌కు పడిపోయారు. జో రూట్ (ఇంగ్లండ్) ఆరో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. డారిల్ మిఛెల్ (కివీస్) ఏడో, దిముత్ కరుణరత్నె (శ్రీలంక) 8వ, ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా) 9వ ర్యాంక్ లో నిలిచారు. రిషబ్ పంత్ (భారత్) పదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బౌలింగ్ విభాగం లో భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ 860 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అండర్సన్ (ఇంగ్లండ్) రెండో, పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) మూడో ర్యాంక్‌లో నిలిచారు. రబడా (సౌతాఫ్రికా) నాలుగో, షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. భారత బౌలర్లు బుమ్రా, రవీంద్ర జడేజాలు టాప్10లో చోటు కాపాడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News