Monday, December 23, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. టీమిండియాకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. ఐసిసి మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి టీమిండియా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. గత 15 నెలలుగా టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐసిసి వెల్లడించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 121 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా నిలకడైన విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం ర్యాంకింగ్స్‌పై స్పష్టంగా కనిపించింది. ఈ సీజన్‌లో 25 టెస్టు మ్యాచ్‌లను ఆడిన భారత్ 3,031 పాయింట్లను సాధించింది. ఈ క్రమంలో 121 రేటింగ్ పాయింట్లతో టీమిండియాకు టాప్ ర్యాంక్ దక్కింది. ఇక ఆస్ట్రేలియా 116 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ మూడో, సౌతాఫ్రికా నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న భారత్‌ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Also Read: పెను ప్రకంపనలు సృష్టించిన వాగ్వాదం.. గంభీర్‌, కోహ్లికి భారీ జరిమానా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News