Sunday, January 5, 2025

టెస్టు ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి బుమ్రా, రెండో స్థానంలో జైస్వాల్..

- Advertisement -
- Advertisement -

ICC టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. మరోసారి నంబర్ బౌలర్ గా నిలిచాడు. బుధవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు తమ ర్యాంకులను భారీగా మెరుగుపర్చుకున్నారు. బ్యాటింగ్‌లో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఇక, పంత్ 6వ స్థానం, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో నిలిచారు.

బౌలింగ్ విభాగంలో బుమ్రా మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ 4, జడేజా 7వ స్థానం పొందారు. ఆల్ రౌండర్లలో జడేజా తొలి స్థానం, అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ ఏడో స్థానంలో నిలిచారు. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇటీవల పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయగా, బుమ్రా 8 వికెట్లతో రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News