Friday, November 22, 2024

అశ్విన్, మయాంక్ ర్యాంక్‌లు మెరుగు

- Advertisement -
- Advertisement -

ICC Test Rankings: R Ashwin jumps to No. 2 in all-rounder list

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్‌లు తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓ సెంచరీ, మరో అర్ధ సెంచరీతో రాణించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తాజా ర్యాంకింగ్స్‌లో పదకొండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో మయాంక్ ఏకంగా 31 ర్యాంక్‌లు మెరుగు పరుచుకుని 11వ స్థానంలో నిలిచాడు. రెండో టెస్టులో మయాంక్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును సయితం గెలుచుకున్నాడు. టీమిండియా విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. విరాట్ 756 రేటింగ్ పాయింట్లతో పాత ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక మరో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 797 పాయింట్లతో ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

కాగా, కివీస్ సిరీస్‌లో రోహిత్‌కు విశ్రాంతి కల్పించారు. అయినా కూడా అతను తన ర్యాంక్‌ను నిలబెట్టుకోవడం విశేషం. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 903 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవలే కేన్ విలియమ్సన్‌ను వెనక్కినెట్టి రూట్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 879 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాకే చెందిన మార్నస్ లబుషేన్ నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్టార్ కరుణరత్నె ఏడో, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 8వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) టాప్10లో చోటు కాపాడుకున్నారు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.

టాప్‌లోనే కమిన్స్..

ఇక బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. కొంతకాలంగా కమిన్స్ ఈ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 883 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో అశ్విన్ మెరుగైన బౌలింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో అతని రెండో ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. మరోవైపు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఒక స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. టిమ్ సౌథి (కివీస్) నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. కగిసో రబడా ఆరో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా 756 పాయింట్లతో పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

అశ్విన్‌కు రెండో ర్యాంక్..

మరోవైపు ఆల్‌రౌండర్ల విభాగం ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. కివీస్‌పై ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లో అశ్విన్ నిలకడగా రాణించాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బెన్‌స్టోక్స్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. వెస్టిండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్ 382 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక భారత స్టార్ రవీంద్ర జడేజా నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News