Sunday, December 22, 2024

ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్ చేయను: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

వన్డే వరల్డ్ కప్ లీగ్ దశలో ఆరు విజయాలతో దూసుకుపోతున్న భారత్ ను నేడు శ్రీలంక ఢీకొంటోంది. ముంబయిలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిస్తే, భారత్ సెమీస్ కు చేరుతుంది. శ్రీలంక ఇప్పటివరకూ రెండే రెండు మ్యాచులలో విజయం సాధించింది. ఇక ఈసారి ఓడితే లంక సెమీస్ ఆశలు గల్లంతు కావడం ఖాయం.

మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ పరిస్థితులను గమనిస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాననీ, జయాపజయాల మాట ఎలా ఉన్నా, తన ప్రయత్నలోపం మాత్రం ఉండదనీ అన్నాడు. పరిస్థితులకు తగినట్లుగా తాను బ్యాటింగ్ చేస్తాననీ, ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్ చేయనని అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News