Thursday, January 23, 2025

రేపు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్

- Advertisement -
- Advertisement -

మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం దుబాయి వేదికగా జరిగే తుది పోరులో న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా తలపడుతుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ ట్రోఫీ సాధించలేదు. ఈసారి గెలిచిన టీమ్ నయా చరిత్ర సృష్టిస్తోంది. సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరింది. న్యూజిలాండ్ గతంలో రెండు సార్లు తుదిపోరుకు అర్హత సాధించినా ట్రోఫీ మాత్రం గెలవలేక పోయింది. ఈసారి ఎలాగైనా కప్పును సాధించాలనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికాతో పోల్చితే కివీస్ బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. సుజీ బేట్స్, జార్జియా, అమెలియా కెర్, కెప్టెన్ సోఫి డివైన్, మాడి గ్రీన్, రోజ్‌మేరీ, కాస్పరెక్, కార్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఇక సౌతాఫ్రికాలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. సెమీస్‌లో ఆస్ట్రేలియా వంటి బలమైన టీమ్‌ను ఓడించడంతో సఫారీ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News