Sunday, January 19, 2025

సఫారీలకు షాక్.. నెదర్లాండ్స్ సంచలన విజయం

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన 38 పరుగుల తేడాతో పటిష్టమైన సౌతాఫ్రికాను చిత్తు చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. కెప్టెన్ ఎడ్వర్డ్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దూకుడుగా ఆడిన ఎడ్వర్డ్ 69 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. మిల్లర్ 43, కేశవ్ మహారాజ్ 40 తప్ప మిగతా వారు విఫలమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీసి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News