దుబాయి: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సీజన్2లో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి సేన అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించడంతో టీమిండియా డబ్లూటిసి టోర్నమెంట్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన భారత్ ఆ మ్యాచ్ ద్వారా రెండు పాయింట్లను సాధించింది. ఇక లార్డ్ మ్యాచ్‌లో చారిత్రక విజయం సాధించడంతో భారత్‌కు మరో 12 పాయింట్లు లభించాయి. ఇలా ఒక డ్రా, ఒక విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించడం ద్వారా పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. పాకిస్థాన్ ఒక విజయం, మరో ఓటమితో మొత్తం 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాక్‌కు రెండో స్థానం లభించింది. వెస్టిండీస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక మిగిలిన జట్లు ఇప్పటి వరకు డబ్లూటిసి సీజన్2లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో వారికి పాయింట్లు రాలేదు. కిందటి డబ్లూటిసి సీజన్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో కూడా భారత్ ఫేవరెట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇందులో ఎంతవరకు సఫలమైవుతుందో వేచి చూడాల్సిందే.