Monday, December 23, 2024

ఐసెట్, పిజిఇసెట్ నోటిఫికేషన్లు విడుదల..

- Advertisement -
- Advertisement -

ICET 2022 Entrance Test Notification Released
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్, ఎం.టెక్, ఎం.ఫార్మసీలో ప్రవేశాల కోసం పిజిఇసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27 వరకు ఐసెట్, ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు పిజిఇసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఐసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబ్రాది, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ రమేష్, ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డిలు బుధవారం విడుదల చేశారు. ఐసెట్ నిర్వహణకు మొత్తం 14 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.రూ.వెయ్యి అపరాధ రుసుముతో జులై 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జులై 27, 28 రెండు రోజుల పాటు ఐసెట్ పరీక్ష జరుగనుంది. ఆగస్టు 22న ఐసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఎంటెక్, ఎంఫార్మసీలో ప్రవేశాల కోసం నిర్వహించే పిజిఇసెట్‌కు ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. రూ.వెయ్యి ఆలస్య రుసుంతో జులై 10 వరకు పిజిఇసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు.జులై 29 నుంచి ఆగస్టు 1వరకు నాలుగు రోజుల పాటు పరీక్షల నిర్వహించనున్నారు.

ICET 2022 Entrance Test Notification Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News