Tuesday, January 21, 2025

సొంత బ్యాంకుకే కన్నం

- Advertisement -
- Advertisement -

ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రూ.8.6 కోట్లు కొల్లగొట్టిన
బ్యాంకు డిప్యూటీ మేనేజర్ వివరాలు వెల్లడించిన
నర్సంపేట సిఐ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు వాడినట్లు గుర్తింపు

మన తెలంగాణ/వరంగల్: నర్సంపేట పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకులో డి ప్యూటీ బ్రాంచ్ మేనేజర్‌గా విధులు ని ర్వర్తిస్తున్న బైరిశెట్టి కార్తీక్ బ్యాంకుకు రూ. 8.60 కోట్లకు పైగా టోకరా వేయడంతో అతడిని అరెస్టు చేసినట్లు న ర్సంపేట సిఐ సుంకరి రవికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐసిఐసిఐ బ్యాంకులో కార్తీక్ గోల్డ్ లోన్ సెక్షన్ పూర్తిగా చూసేవాడు. ఈ క్రమంలో రూ. 8,65,78,956 లను బ్యాంకును మోసం చేసి ఆ డబ్బులను ఆన్‌లైన్ క్రికె ట్ బెట్టింగ్‌కు వాడి మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో 128 మంది ఖాతాదారులకు సంబంధించిన డబ్బులు కార్తీక్ వాడినట్లు విచారణలో తేలిందన్నారు.

బంగారం రుణ ఖాతా క్లోజర్ నిమిత్తం ఖాతాదారులు డబ్బు లు తీసుకొని బ్యాంకు వచ్చినప్పుడు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ ఆ డబ్బులను తీసుకొని వారి ఖాతాలో జమ చేయకుండా వాటిని పక్కకు పెట్టి అనధికారికంగా రుణ ఖాతా క్లోజ్ చేయకుం డా బంగారు ఆభరణాలు ఖాతాదారునికి ఇచ్చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఖాతా రెన్యువల్ డబ్బులు వెంటనే చెల్లించి ఖాతా నడుపుతున్నట్లుగా గుర్తించారు. బ్యాంకు రికార్డులను చూపిం చి ఆ డబ్బులను ఇతనే తన సొంతానికి వాడుకున్నాడని తెలిపారు. ఖాతాదారులు లోన్ రెన్యువల్ లేదా పాక్షిక విత్‌డ్రా లేదా మరింత కొంత బంగా రు ఆభరణాలు జమ చేసి అధిక లోన్ పొందడం కోసం రాగా ఖాతాదారులను వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఖాతా తెరిచి తద్వారా వచ్చిన డబ్బుల నుంచి కొంత పాత రెన్యువల్‌కు వాడుకొని మిగిలిన డబ్బులతో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడేవాడన్నారు.

కొన్నిసార్లు ఖజానాలో ఉన్న బంగా రు పౌచ్‌లను తీసుకొని వేరే వ్యక్తులపై ఖాతా తెరిచి తద్వారా వచ్చిన డబ్బులను క్రికెట్ బెట్టింగ్‌లకు వాడుకొని అనధికారికంగా ఖాతా తెరవడం, ఖాతాదారుని అనుమతి లేకుండా బంగారు పౌచ్‌లను తెరవడం, వేరే వారి పేరుపై అదే బంగారం పెట్టి లోన్ తీసుకుంటూ బ్యాంకును మోసం చేశాడని తెలిపారు. కొన్ని సందర్భరాల్లో ఖాతాదారు లు తన గోల్డ్ లోన్‌ను ఖాతా క్లోజర్ కోసం డబ్బు లు తీసుకొని బ్యాంకుకు రాగా బ్యాంకు సర్వర్ నందు నకిలీ లావాదేవీలు సృష్టించి గోల్డ్ పౌచ్‌లను ఖాతాదారులకు ఇచ్చేసి ఈ డబ్బులను ఖా తాలో జమ చేయకుండా క్లోజ్ అయినట్లు చూపించేవాడు.

కొన్నిసార్లు గోల్డ్ పౌచ్‌లలో నకిలీ ఆభరణాలు పెట్టి కస్టోడియన్, ఆడిటర్ సంతకాలు ఫోర్జరీ చేసి అకౌంట్ క్లోజ్ చేసినట్లు చూపించేవాడని పేర్కొన్నారు.ఇలా మొత్తంగా ఐసీఐసీఐ నర్సంపేట బ్రాంచ్‌లో 2019 నుంచి 2023 ఆగ స్ట్టు వరకు రూ. 8 కోట్లకు పైచిలుకు బ్యాంకును మోసం చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు సిఐ వివరించారు. ఇందులో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని బ్యాంకు ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపి కార్తీక్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ సమావేశంలో నర్సంపేట ఎస్సై శీలం రవికుమార్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News