Sunday, December 22, 2024

శ్రీకాకుళంలో తమ శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

శ్రీకాకుళం: జిల్లా టెక్కలిలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. నగరంలో బ్యాంక్‌కి ఇది మొదటి శాఖ కాగా జిల్లాలో ఆరవ శాఖ. ఈ శాఖలో ATM-కమ్-క్యాష్ రీసైక్లర్ మెషిన్ (CRM) ఉంది, ఇది వినియోగదారులకు 24 గంటలూ నగదు డిపాజిట్, ఉపసంహరణ సేవలను అందిస్తుంది. జిల్లా సబ్ కలెక్టర్, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ నూరుల్ క్వమేర్ ఐఎఎస్ ఈ శాఖను ప్రారంభించారు.

సేవింగ్స్, కరెంట్ ఖాతాలు సహా విస్తృత శ్రేణి ఖాతాలు, ట్రేడ్, ఫారెక్స్ సేవలు, ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు, రుణాలు- వ్యాపార రుణం, గృహ రుణం, వ్యక్తిగత రుణం, ఆటో లోన్, గోల్డ్ లోన్-తో పాటుగా చెల్లింపులు, కార్డ్ సేవలతో సహా సమగ్రమైన సేవలను ఈ శాఖ అందిస్తుంది. NRI కస్టమర్లకు సైతం బ్యాంకింగ్ సేవలను కూడా ఈ శాఖ అందిస్తుంది. ఇది తమ ప్రాంగణంలో లాకర్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇది ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు సోమవారం నుండి శుక్రవారం వరకు, నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాలలో పనిచేస్తుంది.

ఈ శాఖ ట్యాబ్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది, ఇది టాబ్లెట్ పరికరం తో కస్టమర్ ప్రాంగణం వద్ద దాదాపు 100 సేవలను ఒక ఉద్యోగి ద్వారా అందిస్తుంది. ఖాతాలు తెరవడం, ఫిక్సెడ్ డిపాజిట్ (FD), చెక్ బుక్ అభ్యర్థనను చేయడం, ఇ-స్టేట్‌మెంట్‌ల ఉత్పత్తి, చిరునామా మార్పు వంటి సేవలు వీటిలో ఉన్నాయి.

బ్యాంక్ కు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 235 శాఖలు, 495 ATM, క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ (CRM)ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. తమ శాఖలు, ATMలు, కాల్ సెంటర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (www.icicibank.com), మొబైల్ బ్యాంకింగ్ సహా బహుళ-ఛానల్ డెలివరీ నెట్‌వర్క్ ద్వారా ఐసిఐసిఐ బ్యాంక్ తన పెద్ద కస్టమర్ లకు సేవలు అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News