Sunday, November 3, 2024

59 శాతం పెరిగిన ఐసిఐసిఐ బ్యాంక్ లాభాలు

- Advertisement -
- Advertisement -

ICICI Banks net profit up 59% in Q4

ముంబయి : ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభాలతో పోలిస్తే ఇప్పుడు 59 శాతం పెరిగాయి. వడ్డీ ఆదాయం గణనీయంగా పెరగడం, కేటాయింపులు తగ్గడం లాభాలు పెరగడానికి ప్రధాన కారణం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,403 కోట్ల లాభం ఆర్జించగా, ఇప్పుడది రూ.7,019 కోట్లకు పెరిగింది. మార్కెట్ అంచనాలకు మించి లాభాలు ఉండడం గమనార్హం. ఇదే సమయంలో వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగింది.

గడచిన ఏడాది ఇదే సమయంలో వడ్డీ ఆదాయం రూ.10,431 కోట్లు ఉండగా అది ఇప్పుడు రూ.12,605 కోట్లకు చేరింది. అలాగే వడ్డీయేతర రాబడి సైతం గత ఏడాదితో పోలిస్తే 11 శాతం పెరిగి రూ.4,608 కోట్లకు చేరుకుంది. కాగా వివిధ విభాగాలకు బ్యాంక్ కేటాయింపులు 63 శాతం తగ్గి రూ.1,069 కోట్లకు చేరాయి. దేశీయ రుణాలు 17 శాతం పెరగ్గా, రిటైల్ రుణాలు 20 శాతం పెరిగాయి. ఇదే సమయంలో మొత్తం డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.10.64 లక్షల కోట్లకు చేరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News