న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్‌ను పసిగట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్) సరికొత్త కిట్‌ను రూపొందించింది. ఈ సాంకేతికత (రియల్ టైమ్ ఆర్‌టిపిసిఆర్ ఆస్పే) కిట్‌ను డిబ్రుగడ్ లోని ఐసిఎంఆర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. దీనిపై మేథో సంపత్తి హక్కులు, వాణిజ్యపరమైన హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ఒప్పందం కుదుర్చుకున్నవారికి కిట్‌ను తయారు చేసి అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని వెల్లడించింది.కిట్లను వాణిజ్యపరంగా వినియోగించేందుకు, సొంతంగా అభివృద్ధి చేసి కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు ఇన్ విట్రో డయోగ్నాస్టిక్స్ (ఐపీడీ) కిట్ తయారీదారుల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ) కోసం ఆహ్వానించింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి కిట్‌లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు తేలేందుకు ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో ఐసీఎమ్‌ఆర్ కిట్ రూపకల్పనపై తాజాగా ప్రకటించడం ఊరటనిచ్చే విషయం.
ICMR develop new test Kit to detect Omicron