Monday, December 23, 2024

ఎపి-తెలంగాణ మధ్య ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

 

Iconic cable bridge between AP and Telangana

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల వ్యయంతో ఐకానిక్ తీగల వంతెనను నిర్మించేందుకు ఆమోదం తెలిపామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సిద్ధేశ్వరం, సోమశిల మధ్య ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు.  విశాలమైన శ్రీశైలం జలాశయానికి చేరువగా నల్లమల అడవి, ఎత్తయిన కొండల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తెలంగాణ వైపున లలితా సోమేశ్వర ఆలయం, ఎపి వైపున సంగమేశ్వర ఆలయంతో ఇదొక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని వివరించారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఎపిలోని నంద్యాల జిల్లా వాసులకు మంచి శుభవార్త.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News