Sunday, February 23, 2025

ఐడిబిఐలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో 1544 పోస్టులు

- Advertisement -
- Advertisement -

IDBI Bank Recruitment 2022

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ).. అసిస్టెంట్ మేనేజర్, ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఒక ఏడాది వ్యవధి గల పీజీడీబీఎఫ్ కోర్సు పూర్తయ్యాక నియామకం ఖరారు చేస్తారు.

మొత్తం పోస్టులు – 1544
పోస్టుల వివరాలు: ఎగ్జికూటివ్‌లు 1044
అసిస్టెంట్ మేనేజర్‌లు 500
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి 21-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
చివరితేది: జూన్ 17, 2022
వెబ్‌సైట్: https://www.idbibank.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News