అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ సమీర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘అర్జున్ మంచి నటుడు. విలక్షణమైన పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. జె.డి.చక్రవర్తికి సినిమా అంటే ప్యాషన్. వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రం హిట్ కావాలి. సమీర్ కష్టపడే తత్వం గలవాడు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే అతను బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. చిన్న సినిమాలు ఆడితేనే పరిశ్రమ బావుంటుంది’’ అని అన్నారు.
తీన్మార్ మల్లన మాట్లాడుతూ ‘‘సినిమా వేదికలకూ నాకు చాలా దూరం. ఇప్పటి దాకా తాను పది సినిమాలు చూసుంటాను అంతే! అందులో ఒకటి అర్జున్ నటించిన సినిమా. మరొకటి ఆర్‌జీవీ చూడమంటే ‘కొండ’ సినిమా మా దోస్త్‌లతో కలిసి చూశా. సినిమా విషయంలో నా అంత అజ్ఞాని లేడు. ఎంతోకొంత సినిమా గురించి తెలుసుకోవాలనీ, ఆత్మీయులు పిలిచారని ఈ వేడుకకు వచ్చా. ఓ సందర్భంలో గబ్బర్‌సింగ్ అంత్యాక్షరి టీమ్ కాల్ చేస్తే చెప్పండి హీరోస్ అన్నాను. అన్నా మేం హీరోలేంటి అన్నారు. విలన్ లేనిదే హీరో ఎక్కడ ఉంటాడబ్బా అన్నాను. ఈ సినిమా ట్రైలర్ చూశా. ఆసక్తికరంగా ఉంది. నా దగ్గరికి సినిమాలకు సంబందించిన సమస్యలు ఉంటాయి. సినిమా అనేది చూడటానికి వినోదమే కానీ తెర వెనుక, ఓ సినిమా తీసి దానిని విడుదల చేయడానికి చాలా కష్టపడాలి. మేం కూడ ఈ మధ్యన మా న్యూస్ కార్యక్రమాలను సినిమాటిక్‌గానే చేస్తున్నాం. నన్ను చాలామంది సినిమాల్లో నటించమని అడిగారు. నాకు సెట్ కాదని వెళ్లలేదు. మనమున్న వ్యవస్థకు సందేశాత్మక చిత్రాలు రావాలి. ఆ దిశగా ఆలోచన చేయాలి’’ అని అన్నారు.
దర్శకుడు ఎస్.ఎస్ సమీర్ మాట్లాడుతూ ‘‘ప్రజంట్ జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. అర్జున్, జె.డి. చక్రవర్తి ఈ కథకు యాప్ట్ అయ్యారు. యాక్షన్‌తోపాటు చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది. నిర్మాత సహకారం మరువలేనిది’’ అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘చాలా కష్టం పడి సినిమా పూర్తి చేశాం. సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది చివరి వరకూ గెస్ చేయలేరు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంఇ. క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలైట్ అవుతోంది. ఈ నెల 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మంచి టాక్‌తో హిట్ అవుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు మంచి కథతో ఈ చిత్రం చేశాడు. అవుట్‌పుట్ చూసిన అందరూ ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. దర్శకుడు ఎస్‌ఎస్ సమీర్ రాజమౌళి అంత పెద్ద దర్శకుడు కావాలి’’ అని అన్నారు.
అశోక్‌కుమార్, కరాటే లక్ష్మీ తదితరులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
నటీనటులు:
సోనీ చరిష్టా
కెవిశ్వనాధ్
అశోక్‌కుమార్
శిల్ప
రామ్‌జగన్
దుబాయ్ రఫీక్
సంధ్యాజనక్
సాంకేతిక నిపుణులు:
ఫొటోగ్రఫీ: ఆమీర్ అలీ
ఆర్ట్: రఘు కులకర్ణి
సంగీతం: సుభాష్ ఆనంద్
యాక్షన్ డైరెక్టర్: కాళీ కికాస్
ఎడిటింగ్: ప్రభు
కొరియోగ్రఫి: అమ్మా రాజశేఖర్
పీఆర్వో మధు విఆర్