Wednesday, January 22, 2025

యాక్షన్‌తో పాటు చక్కని వినోదం

- Advertisement -
- Advertisement -

అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ సమీర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎస్.ఎస్ సమీర్ మాట్లాడుతూ “నేటి తరానికి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. యాక్షన్‌తోపాటు చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, తీన్మార్ మల్లన్న, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News