Saturday, December 21, 2024

కొండపాకలో రాష్ట్ర కూట సరస్వతి విగ్రహం గుర్తింపు

- Advertisement -
- Advertisement -

కొండపాక: కొండపాక మండల పరిధిలోని పోచమ్మగుడి దగ్గర సరస్వతి దేవి శిల్పాన్ని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు కొలిపాక శ్రీనివాస్, ఆహోబిలం కరుణాకర్, ఎండి నసీర్, సామలేటి మహేశ్‌లు బుధవారం గ్రామంలో విగ్రహాన్ని కనుగోన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విగ్రహానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. కొండపాక చారిత్రకంగా ప్రసిద్ధమైన గామమని చారిత్రాలక పూర్వ యుగం నుంచి చరిత్ర యుగం దాకా ఆపురూపమైన పురాతన వస్తువులు, శిల్పాలు శాసనాలు లభించిన గ్రామం అన్నారు. సరస్వతి శిల్పాలు తెలంగాణలో పలు చోట్ల లభించాయని అందులో కోలనుపాక నంది కంది వేల్పుగొండ, వరంగల్, బాసరలలో కొత్త సరస్వతి విగ్రహాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించిందన్నారు.

కొండపాకలో లభించిన విగ్రహం చతుర్భుజీమైన సరస్వతి నిజహస్తాలలో అక్షమాల, పుస్తకం పరహస్తాలలో అంకుశం, పాశాలున్నాయని తెలిపారు. ఆసన స్థితిలో వున్న దేవత వివిధ ఆభరణాలతో ఆలంకృతమై ఉందన్నారు. జైనంలో సరస్వతిని శ్రుతదేవి అంటారు. కి.పూ.3వ శతాబ్ధానికి చెందిన జ్ఞాన సరస్వతి శిల్పం మధురలో శాసనంతో లభించిందని కొలనుపాకలో ఉన్న సరస్వతి శిల్పాన్ని శ్రుతదేవి అంటారన్నారు. కొండపాకలో లభించిన సరస్వతి శిల్పం కూడా బాసరంలో లభించిన జ్ఞాన సరస్వతిని పోలివుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News