Monday, December 23, 2024

రికవరీ నోటీసులు ఆపండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల అనర్హులను గుర్తించి, వారి నుంచి రికవరీ చేసే విధానానికి ప్రభుత్వం విరమించుకుంది. త్వరలో దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతికుమారి  స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే వరకు ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలలో చేర్చబడిన లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం, లేదా ఆయా మొత్తాలను రికవరీ చేయడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సచివాలయంలో అన్నివిభాగాలకు, జిల్లా కలెక్టర్లకు ఆమె ఆదివారం సర్కులర్‌ను జారీ చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను పొందే లబ్ధిదారుల్లో ప లువురు అనర్హులు ఉన్నట్టు పలు మార్గాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపా రు. ఈ ప్రభుత్వ పధకాలు మరింత సమర్థవంతంగా, అర్హులైన లబ్ధిదారులందరికీ అం దించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం మేరకు, ఈ పధకాల అమలు తీరును క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆ సర్కులర్‌లో వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగుగా, సమర్థవంతంగా పథకాలను వర్తింపచేసేందుకు రాష్ట్ర శాసనసభ రాబోయే బడ్జెట్ సమావేశాలలో, పథకాల అమలులో గుర్తించిన అవకతవకలను చర్చించి తగు చర్యలు తీసుకునే అ వకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News