మహమ్మదాబాద్ : మండల కేంద్రం మహమ్మదాబాద్‌లో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ, వికలాంగులకు పెంచిన రూ.4016 పెన్ష్ మంజూరి పత్రాలను ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో గతంలో ఎన్నడు లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మూడు నాలుగు ఎవరి రికమండేషన్ లేకుండానే అందుత్నునాయి. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ల సందర్భంగా చెప్పినవి అలాగే చెప్పనివి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు.
రైతుబంధు, రైతు భీమా, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మీ ఇలా రుణమాఫీ, కళ్యాణ లక్ష్మీ ఎన్నో పథకాలు అందుతున్నాయన్నారు.అనంతరం చిన్నాయపల్లి గ్రామంలోరెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం , యాదవ సంఘం భవానానికి శంకుస్థాపన చేశారు. గొల్ల కురుమలకు విడుదలవారిగా డీడీలు చెల్లించిన ప్రతి ఒక్కరికి గొర్రెల అందించబడతాయని ఎవరు కూడా అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.
అభివృద్ది చేసే వారికి వచ్చే ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, ఎంపీడీఓ ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్ యేసయ్య, వెటర్నరీ డా. రాంప్రసాద్, మహమ్మదాబాద్ సర్పంచ్ పార్వతమ్మ రాజేశ్వర్ ఎంపీటీసీ చెన్నయ్య, నాయకులు ఆశోక్‌రెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, ఆయా గ్రమాల సర్పంచులు, ఎంపీటీసీలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.