Monday, January 20, 2025

తెరువనున్న ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ..

- Advertisement -
- Advertisement -

ముంబై : ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నేడు తమ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఈక్విటీలు మరియు ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో గణనీయంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలపు మూలధన వృద్ధిని ఇది లక్ష్యంగా చేసుకుంది. ఈ మిడ్‌క్యాప్‌ విభాగం, భారీ క్యాప్స్‌తో పోల్చుకుంటే , మెరుగైన రీతిలో రిస్క్‌ సర్దుబాటు చేసిన రాబడిని అందిస్తుంది. అంతేకాదు, గత మూడేళ్లగా మిడ్‌క్యాప్‌ ప్రపంచంలో సరాసరి కంపెనీల పరిమాణం కూడా విస్తరించింది. దీర్ఘకాలంలో సంభావ్య మిడ్‌క్యాప్‌ కంపెనీల శక్తివంతమైన వృద్ధి సామర్ధ్యం నుంచి ప్రయోజనం పొందే వినూత్న అవకాశాన్ని మదుపరులకు ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ అందిస్తుంది. ఈ నూతనఫండ్‌ ఆఫర్‌ను గురువారం, జూలై 28, 2022న తెరుస్తారు మరియు గురువారం, ఆగస్టు 11,2022వ తేదీన మూసి వేస్తారు. ఈ ఎన్‌ఎఫ్‌ఓ దరఖాస్తులను https://bit.ly/3J36qcQ వద్ద పూర్తి చేయవచ్చు.

ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఆవిష్కరణ గురించి ఐడీఎఫ్‌సీ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఎంసీ) సీఈఓ విశాల్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘భారతీయ ఆర్ధిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుండటంతో , మదుపరులు వృద్ధి ఆధారిత ఆస్తులపై పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. ఈ తరహా ఆస్తులు దీర్ఘకాలంలో తమ పెట్టుబడులను వృద్ధి చేస్తాయి. తమ ప్రస్తుత ఆస్తుల కింద మిడ్‌క్యాప్‌ విభాగంలో ఆస్తులను నిర్వహించడంలో దీర్ఘకాలిక నైపుణ్యాన్ని ఐడీఎఫ్‌సీ ఏఎంసీ కలిగి ఉంది, మార్కెట్‌ వాల్యూయేషన్లు మరింత ఆకర్షణీయంగా మారడంతో ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఇప్పుడు మదుపరులకు ఫండమెంటల్‌గా బలీయమైన మిడ్‌ క్యాప్‌ కంపెనీ ల విస్తృతస్థాయి వృద్ధి సామర్థ్యం నుంచి ప్రయోజనం పొందే అవకాశాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.

ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ కోసం ఫండ్‌ మేనేజర్‌ సచిన్‌ రెలెకర్‌ మాట్లాడుతూ ‘‘పోర్ట్‌ఫోలియో నిర్మాణం కోసం బాటమ్‌ అప్‌ ఇన్వెస్టింగ్‌ విధానాన్ని ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ అనుసరిస్తుంది. ఈ ఫండ్‌ ప్రధానంగా మిడ్‌ క్యాప్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఇది క్రమశిక్షణాయుతమైన విధానం స్వీకరించడంతో పాటుగా తమ ఆస్తులలో 35%ను లార్జ్‌ క్యాప్‌ మరియు స్మాల్‌ క్యాప్‌ విభాగాలలోని కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోలో దీర్ఘకాలపు పెట్టుబడులను పెట్టాలనుకునే మదుపరులు కోసం ఈ ఫండ్‌ తగినట్లుగా ఉంటుంది’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News