Sunday, January 19, 2025

ట్రాన్స్‌పోర్టేషన్‌, లాజిస్టిక్స్‌ ఫండ్‌ను విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఇప్పుడు రవాణా మరియు లాజిస్టిక్స్‌ రంగంలో పెట్టుబడులు పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం ఐడీఎఫ్‌సీ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. మొబిలిటీ సర్వీస్‌ రంగంలో బహుళ సంవత్సరాలలో వృద్ధి అవకాశాల నుంచి ప్రయోజనం పొందేందుకు ఇది లక్ష్యంగా చేసుకుంది. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ను అక్టోబర్‌ 04, 2022 న తెరిచారు, దీనిని అక్టోబర్‌ 18, 2022 న మూసి వేయనున్నారు. పెట్టుబడులను లైసెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు మరియు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా మాత్రమే గాక ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ వెబ్‌సైట్‌ https://idfcmf.com/ ద్వారా నేరుగా పెట్టవచ్చు.

ఐడీఎఫ్‌సీ ట్రాన్స్‌పోర్టేషన్‌ మరియు లాజిస్టిక్స్‌ ఫండ్‌ విడుదల చేయడం గురించి ఐడీఎఫ్‌సీ ఏఎంసీ సీఈఓ శ్రీ విశాల్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘వేగవంతమైన నగరీకరణ, వ్యక్తిగత మొబిలిటీ అవసరాలు వృద్ధి చెందేందుకు సైతం తోడ్పడుతుంది. అదనంగా, శక్తివంతమైన ఎనేబలర్స్‌ అయిన శక్తివంతమైన డిమాండ్‌ ఆధారిత రికవరీ సైకిల్‌ మరియు మార్జిన్‌ వృద్ధి వంటివి లాజిస్టిక్స్‌, రవాణా రంగానికి చక్కటి వృద్ధినీ అందిస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ట్రాన్స్‌పోర్టేషన్‌ మరియు లాజిస్టిక్స్‌ ఫండ్‌ను ఓ టీమ్‌ చురుగ్గా నిర్వహిస్తుంది’’ అని అన్నారు.

ఐడీఎఫ్‌సీ ట్రాన్స్‌పోర్టేషన్‌, లాజిస్టిక్స్‌ ఫండ్‌ కోసం ఫండ్‌ మేనేజర్‌ శ్రీ డేలిన్‌ పింటో మాట్లాడుతూ.. ‘‘ట్రాన్స్‌పోర్టేషన్‌, లాజిస్టిక్స్‌ రంగంలో 16 ఉప వర్గాలు ఉన్నాయి. ఇవి విస్తృత శ్రేణిలో పెట్టుబడి అవకాశాలను అందించడంతో పాటుగా పోర్ట్‌ఫోలియో డైవర్శిఫికేషన్‌ సైతం అందిస్తాయి. ఆగస్టు 2022 నాటికి ఎన్‌ఎస్‌ఈ డాటా సూచించే దాని ప్రకారం నిఫ్టీ ట్రాన్స్‌పోర్టేషన్‌, లాజిస్టిక్స్‌ ఇండెక్స్‌ నిఫ్టీ 500 ఇండెక్స్‌లో చక్కటి ప్రదర్శనను 2012–2022 మధ్య 11 సంవత్సరాలలో 8 సంవత్సరాలు చేసింది. ఈ ఫండ్‌ ప్రధానంగా ట్రాన్స్‌పోర్టేషన్‌, లాజిస్టిక్స్‌ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. అంతేకాదు, 20% పైగా నెట్‌ ఎస్సెట్స్‌ను అంతర్జాతీయ వ్యాపారాలు, ఇతర రంగాల కంపెనీలలో పెట్టుబడులు పెట్టనుంది’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News