Monday, December 23, 2024

ఐడీఎఫ్‌సీ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ గిల్ట్‌ ఏప్రిల్‌ 2026 ఇండెక్స్‌ ఫండ్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తాము ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌ ఐడీఎఫ్‌సీ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ గిల్ట్‌ ఏప్రిల్‌ 2026 ఇండెక్స్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. క్రిసిల్‌ ఐబీఎక్స్‌ గిల్ట్‌ ఇండెక్స్‌ ఏప్రిల్‌ 2026 లో ఇది పెట్టుబడులు పెడుతుంది. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ గురువారం అక్టోబర్‌ 13, 2022 న తెరిచారు. బుధవారం, అక్టోబర్‌ 19, 2022న దీనిని మూసి వేస్తారు. ఈ పెట్టుబడులను లైసెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా మాత్రమే గాక నేరుగా https://idfcmf.com/. ద్వారా కూడా పెట్టవచ్చు.

గిల్ట్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్స్‌లో మదుపరులు పెట్టుబడులు పెట్టడం గురించి ఐడీఎఫ్‌సీ ఏఎంసీ సీఈఓ విశాల్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘మారుతున్న ఆర్ధిక, మార్కెట్‌ పరిస్ధితులలో మదుపరులు తమ పోర్ట్‌ఫోలియోను నాణ్యమైన డెబ్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ వ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు. ఇది సహేతుకమైన స్థిరత్వం, అత్యధిక లిక్విడిటీ , సంప్రదాయ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ తో పోలిస్తే మహోన్నతమైన ఫ్లెక్సిబిలిటీ అందిస్తుంది. గిల్ట్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌లు నిర్ధిష్ట మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉన్నందున సమర్ధవంతమైన పెట్టుబడి పరిష్కారం కావొచ్చు.

ఇది ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతుంది, తద్వారా అత్యధిక నాణ్యత గత ఋణ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అదనంగా, ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ మదుపరులకు గణణీయంగా లిక్విడిటీ అందిస్తాయి. తమ పెట్టుబడులను అతి సులభంగా పనిదినాలలో రిడీమ్‌ చేయవచ్చు. ఈ ఫండ్స్‌ సహేతుకమైన రాబడిని మదుపరులకు అందించడంతో పాటుగా మదుపరులు ఎక్కువకాలం సమీకరించుకునేలా ప్రోత్సహిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ ఫండ్స్‌ ఇండెక్సేషన్‌ ప్రయోజనాలను మదుపరులకు మూడు సంవత్సరాలకు పైబడి అందించడంతో పాటుగా లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా కల్పించి వారి సంపాదన సామర్థ్యం సైతం పెంచుతాయి. ఐడీఎఫ్‌సీ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ గిల్ట్‌ ఏప్రిల్‌ 2026 ఇండెక్స్‌ ఫండ్‌ అతి సరళమైనది. అత్యున్నత నాణ్యత కలిగిన డెబ్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను అతి తక్కువ ధరలో మదుపరులు చేరుకునే అవకాశాన్ని మ్యాచింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ టైమ్‌ హారిజన్‌తో అందిస్తుంది’’ అని అన్నారు.

ప్రస్తుత అవకాశం గురించి ఐడీఎఫ్‌సీ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ గిల్ట్‌ ఏప్రిల్‌ 2026 ఇండెక్స్‌ ఫండ్‌ కోసం ఫండ్‌ మేనేజర్‌ శ్రీ గౌతమ్‌ కౌల్‌ మాట్లాడుతూ ‘‘మానిటరీ పాలసీ కఠినతరం చేయడం గురించి మార్కెట్‌ అంచనాలో ఇటీవలి కాలంలో పెరుగదల ఫలితంగా రాబడులలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈల్డ్‌ కర్వ్‌లో షార్టర్‌ ఎండ్స్‌లో ఇది కనిపిస్తుంది. 3–4 సంవత్సరాల మెచ్యూరిటీ బకెట్‌లో అప్‌వార్డ్‌ ఈల్డ్‌ షిప్ట్‌తో 2026 గిల్ట్‌ విభాగం ఆసక్తికరమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నాము. ఐడీఎఫ్‌సీ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ గిల్ట్‌ ఏప్రిల్‌ 2026 ఇండెక్స్‌ ఫండ్‌ ఈ వ్యూహంతో ప్రయోజనం పొందవచ్చు, ఇది సరైన సమయంలో విడుదల చేయడం జరిగింది. మ్యాచ్‌ మేకింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ టైమ్‌ హారిజన్‌లో అత్యున్నత నాణ్యత కలిగిన పెట్టుబడులు కోరుకునే మదుపరులకు ఈ ఫండ్‌ తగిన విధంగా ఉంటుంది’’ అని అన్నారు

టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్స్‌కు నిర్వచిత మెచ్యూరిటీ తేదీ ఉంటుంది మరియు బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌కు సరిపోలినట్లుగా ఉండే డెబ్ట్‌ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెడుతుంది. మెచ్యూరిటీ తరువాత యూనిట్‌ హోల్డర్లకు వారి పెట్టుబడులను తిరిగి చెల్లిస్తారు. ఐడీఎఫ్‌సీ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ గిల్ట్‌ ఏప్రిల్‌ 2026 ఇండెక్స్‌ ఫండ్‌ చురుగ్గా నిర్వహించే లక్ష్యం కలిగిన మెచ్యూరిటీ ఫండ్‌. ఇది కేవలం సావరిన్‌ రేటెడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. భారత ప్రభుత్వం దీనికి హామీ ఇస్తుంది. తద్వారా క్రెడిట్‌ రిస్క్‌ తగ్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News