Sunday, June 30, 2024

రోడ్డెక్కిన ఐడిఎల్ బాధితులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కెపిహెచ్‌బి:కూకట్‌పల్లిలోఐడీఎల్ భూముల్లో ‘హిందూజాదు’శీర్షికన మనతెలంగాణలో ప్రచురితమైన కథనంతో ఐడీఎల్ కంపెనీ కోసం భూములను త్యాగం చేసిన రైతు కుటుంబాలు,వారి వారసులు రోడ్డెక్కారు. మన తెలంగాణ దినపత్రికలను చేత బట్టి ఐడీఎల్‌కంపెనీల్లో వెలుస్తున్న నిర్మాణ సంస్థల వద్ద తమ నిరసన తె లిపారు. గత 50 ఏళ్ళ క్రితం తమ తాతలు, దం డ్రులు ఎంతో చమటోడ్చి సంపాదించిన భూ ములను తమకు దక్కనీయకుండా అప్పటి ప్రభుత్వం వద్ద బలవంతంగా లాక్కుని తమ నుంచి లాక్కు ని కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. భూము లు కోల్పోయిన బాధితులకు ఉద్యోగం.. ఉపాధి క ల్పిస్తామని ముఖం చాటేశారని, ఇస్తామన్న పరిహారం కూడా అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాధిత రైతులు వాపోయారు. నాడు ఎ కరానికి వెయ్యి రూపాయలు కూడా సక్రమం గా ఇవ్వలేదని, ఇప్పుడు అదె ఎకరం ను వంద కోట్ల చొప్పున బడా నిర్మాణ సంస్థలకు విక్రయించి కాసుల పంట పండించుకుంటున్నారని తమ ఆ క్రోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అండదండల తో హిందూజా కార్పొరేట్ సంస్థ

తమ భూముల్లో చేస్తున్న కాసుల సేధ్యంపై ‘మనతెలంగాణ’ ‘ ఐడీఎల్ భూముల్లో హిందూజాదు’ సాగిస్తున్న రియల్ దందాను వెలుగులోకి తేవడం తమలో కొండంత దైర్యాన్ని కలిగించిందని బాధిత రైతు కుటుంబాలు తెలిపాయి. పట్టాదారులనుంచి ఎలాంటి దస్త్రం,సంతకం లేకుండానే భూములను లాక్కుని, బాంబులు పడతాయని ..ప్రాణాలు పొతాయని భయభ్రాంతులకు గురిచేసి అప్పట్లో తమను తమ పంట పొలాలనుంచి దూరం చేశారని బాధిత రైతులు కుమ్మరి దాసు, కమ్మరి నాగప్ప, ఎక్కల్‌దేవ్ నర్సింగయాదవ్, శామీర్‌పేట రంగయ్య, ఎక్కల్‌దేవ్ వెంకటేష్‌యాదవ్, పద్మారావుయాదవ్ లు వాపోయారు. నిన్న మొన్నటి వరకు కాస్రా పహాణీలో కూడా తమ తాతలు, తండ్రల పేర్లే ఉన్నాయని, ధరణీ వచ్చిన తరువాత తమ పేర్లను మాయం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునారాలోచించి నిబంధనలకు విరుద్ద హిందూజా సంస్థకు దారదత్తం చేసిన భూములను వెనక్కి తీసుకొని తమకు చెందేలా చూడాలని ప్రాదేయపడ్డారు. ఇప్పటికే సర్వం త్యాగం చేసిన తాము ఇంకా ఎలాంటి త్యాగం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

మా బ్రతుకులు దుర్భరంగా మారాయి
మా తండ్రి పేరు మీద కుమ్మరి బాలయ్య .ఆయన పేరు మీద 36 ఎకరాలు ఉండేది. అప్పట్లో తమ కుటుంబం కుమ్మరి వృత్తితోపాటు వ్యవసాయం చేసుకుంటూ దర్జాగా బ్రతికాం. ప్రభుత్వం ఐడీ ఎల్‌కంపెనీ పేరుతో భూమిని లాక్కున్న తరువాత తమకుటుంబ పరిస్థితి దుర్బరంగా మారింది. కుండలు చేసుకుంటూ, చాలీచాలని ఆదాయంతో బ్రతుకీలిస్తున్నాం. కంపెనీ నడవ కుంటే ప్రభుత్వం మా భూములు మాకు అప్పగిస్తే ఎంతో ఎంతో మేలుచేసిన వారవుతారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం.
కుమ్మరి దాసు, లక్ష్మీ దంపతులు ( ఫోటోరైటప్‌ః 27కేపీహెచ్‌బి01లో…)

కంపెనీ నడించకపోతే ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలి
మా తాత ఎక్కల్‌దేవ్ పెంటయ్య. ఆయన పేరుమీద 34 ఎకరాల భూమి ఉండేది. కంపెనీపేరుతో భూమిని బలవంతంగా లాక్కున్నారు. కంపెనీలో ఇస్తామన్న ఉద్యోగం ఇవ్వలేదు. ఎకరానికి 400 మాత్రమే అప్పట్లో ప్రభుత్వం మాకు ఇచ్చింది. ఇప్పుడు కంపెనీ ముసుగులో ఉన్న హిందూజా సంస్థ భూములను బడా నిర్మాణ సంస్థలకు ఎకరానికి వంద కోట్ల చొప్పున అమ్ముకుంటుంది. ఇదేమి న్యాయం. కంపెనీ నడవక పోతే ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలి. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని. ధర్మంగా అయితే రైతులకు తిరిగి ఇవ్వాలి. ఇటు తమకు ఇవ్వకుండా… ప్రభుత్వం తీసుకోకుండా కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా వ్యవహరించడం ఇదేమి చట్టమో…ఇదేమి న్యాయమో అర్ధం కావడం లేదు. నాయకులు, పార్టీలు ఏం చేస్తున్నట్లు . ఇదే ప్రజాస్వామ్యం. చట్టం,న్యాయం చెప్పేది కార్పొరేటర్ సంస్థలకు భూములను దారాదత్తం చేయమనేది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
ఎక్కల్‌దేవ్ నర్సింగ్‌యాదవ్ బాధిత రైతు కుటుంబీకుడు ( ఫోటోరైటప్‌ః 27కేపీహెచ్‌బి 02లో…)

కంపెనీలో ఉన్న తమ భూముల్లో ఆత్మహత్య చేసుకుంటాం
మా తండ్రి కమ్మరి శివయ్య పేరుమీద 16 ఎకరాల పట్టా ఉండె. కంపెనీ పేరుతో లాగేసుకున్నారు. ఒకపుపడు కుల వృత్తితోపాటు వ్యవసాయ చేసుకుంటూ దర్జాగా బ్రతికాం. కంపెనీ పేరుతో లాగేసుకుని కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఉపాధికోసం కుటుంబం చెల్లాచెదురైంది. కూళీ, నాళీ చేసుకుని జీవపం సాగించాల్సిన పరిస్థితి మాది. కంపెనీ పేరుతోతీసుకున్న భూములను రైతు కుటుంబాలకు ఇచ్చేయాలి. మా దయనీయ పరిస్థితిని అర్ధంచేసుకుని ప్రభుత్వం ఇప్పించాలి. లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. కుటుంబాలతో సహా వచ్చిన కంపెనీ లోని మాభూమల్లోని చెట్లకు ఉరిసుకుంటాం.
కమ్మరి నాగప్ప, బాధిత రైతు కుటుంబీకుడు ( ఫోటోరైటప్‌ః 27కేపీహెచ్‌బి03లో…)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News