Monday, January 20, 2025

వేంసూరులో ఈదు ఉల్ జుహా

- Advertisement -
- Advertisement -

వేంసూరు : మండల కేంద్రమైన వేంసూరులో ఈద్గా వద్ద ఈదు ఉల్ జూహాను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజు చేశారు. పెషి ఇమామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు అల్లా ఆదేశాను సారం ఇబ్రహీం తన ఏకైక సంతానమైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. సంప్రదాయాన్ని స్మరిస్తూ ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటామని అన్నారు. ఖుర్బానీ అంటే మాంసాన్ని పేదలకు దానం ఇవ్వడం. ఇబ్రహీం తన ప్రాణత్యాగాన్ని మెచ్చిన అల్లా ప్రాణ త్యాగం వద్దని, ఏదైనా జీవిని బలి ఇవ్వాలని కోరగా, ఆనాటి నుంచి నేటి వరకు, గోవులను ఒంటెలను, మేకపోతులను, ప్రతి ముస్లిం తప్పనిసరిగా, వారి స్థోమతను బట్టి ఖుర్బానీ ఇవ్వాలని, బలి ఇచ్చిన జంతువు, వెంట్రుకలు, తాము చేసిన పాపాలు అల్లా క్షమిస్తాడన్నారు. చేసిన పాపాలు క్షమించాలని, ఈ లోకం నుండి వెళ్లిపోయిన వారందరి పాపాలు క్షమించి, స్వర్గంలోక ప్రాప్తి లభించాలని అల్లాహని దువా చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, చిన్నలు పెద్దలు, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ లింగనం చేసుకున్నారు. హిందువులు ముస్లింలకు, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News